ePaper
Sunday, November 22, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండబాలల పరిరక్షణ మిషన్ వాత్సల్య ఆధ్వర్యంలో వాకథాన్

బాలల పరిరక్షణ మిషన్ వాత్సల్య ఆధ్వర్యంలో వాకథాన్

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌
బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని హ‌న్మ‌కొండ‌ జిల్లా మహిళలు పిల్లలు దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం మిషన్ వాత్సల్య ఆధ్వర్యంలో వాకథాన్ కార్యక్రమం పోలీస్ కమిషనరేట్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించడం జరిగింది.యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీస్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ, డాన్ బాస్కో నవజీవన్,షేర్ స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో నిర్వహించగా జిల్లా సంక్షేమ అధికారి ఎం విశ్వజ,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్, బాలల న్యాయ మండలి సభ్యురాలు డాక్టర్ గోపికా రాణి, కేయూ పాలక మండలి సభ్యురాలు అనితా రెడ్డి జెండా ఊపి వాకథాన్ ప్రారంభించారు.వాకథాన్ అనంతరం.. కళాజాత బృందం ఆధ్వర్యంలో బాలల హక్కులు, బాల్యవివాహాల నిర్మూలన, మానవ అక్రమ రవాణా నివారణ చర్యలు పై పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ బాలల హక్కుల ప్రాముఖ్యతపై వివరించారు. బాలల హక్కుల ఒడంబడికలో హక్కులున్నాయని అందులో ప్రధానంగా జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, పాల్గొనే హక్కులున్నాయని బాలల హక్కులకు భంగం కలుగకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అన్నారు. నా రోజు నా హక్కులు, నా భవిష్యత్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా వారి భవిష్యత్ జీవితం నిర్దేశించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.అనంతరం బెలూన్లను పిల్లలతో కలిసి ఎగురవేసి, సిగ్నేచర్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి ఎం విశ్వజ, బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సి హెచ్ అవంతి, సిస్టర్ సహాయ, ఫాదర్ కోషి , కేయూ పాలక మండలి సభ్యురాలు కే అనితా రెడ్డి, ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, ఇంచార్జి డిసిపిఓ ఎస్ ప్రవీణ్ కుమార్, జేజేబి మెంబర్ గోపికా రాణి, సిడిపిఒ లు, ఐసీడీఎస్ సూపర్వైజర్, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎం లు ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!