ePaper
Saturday, November 21, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండకుడా కార్యాల‌యం కాళోజీ కళాక్షేత్రానికి కుడా KUDA కార్యాలయం తరలింపు

కుడా కార్యాల‌యం కాళోజీ కళాక్షేత్రానికి కుడా KUDA కార్యాలయం తరలింపు

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌
హనుమకొండలోని ఆర్డీఓ కార్యాలయం పక్కన ఉన్న కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కార్యాలయాన్ని బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం రెండవ, మూడవ అంతస్తులోకి తరలించారు.నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్, కుడా వైస్ ఛైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయి సందర్శించారు. కార్యాలయ తరలింపు అనంతరం కుడా లోని ఆయా విభాగాల వారీగా చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాళోజి కళాక్షేత్రంలోని కుడా కార్యాలయం నుండి అధికారులు విధులు నిర్వర్తించనున్నారు.ఈ కార్యక్రమంలో కుడా సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్‌రావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!