ePaper
Sunday, August 9, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండడబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హనుమకొండ హ‌న్మ‌కొండ జిల్లా కమలాపూర్ మండలంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎన్. రవి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెం గ్రామాలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల సముదాయంలో ప్రస్తుతం ఉన్న వసతులు, ఇళ్ల పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇళ్ల ప్రారంభోత్సవం, అర్హులైన లబ్ధిదారులకు కేటాయింపు, ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు ఇన్ఛార్జి కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రవి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు ర్యాండమైజేషన్ ద్వారా ఇళ్ల కేటాయింపు చేయనున్నట్లు తెలిపారు. గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించనున్న దృష్ట్యా సదుపాయాలను వేగవంతంగా కల్పించాలని గృహ నిర్మాణ, ఆర్ అండ్ బీ, ఎంపీడీవోలను ఆదేశించారు. గూడూరులో 50, మర్రిపల్లి గూడెంలో 50, కమలాపూర్ లో 302 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇళ్ల సముదాయంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెం గ్రామాల సర్పంచులు బండి వనజ, పబ్బు సతీష్, కదురు కవిత, కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఝాన్సీ, గృహ నిర్మాణ శాఖ పిడి సిద్ధార్థ నాయక్, ఆర్ అండ్ బి ఈఈ దేవిక,తహసిల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో గుండె బాబు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!