ఆయుధం న్యూస్ వరంగల్
ఉత్తర తెలంగాణకే తలమానికమైన, వరంగల్ నగరంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎంజీఎం ఆసుపత్రి కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్ల వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతోందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆందొళన వ్యక్తం చేశారు.ఆదివారం నాడు ఎంజీఎం ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఆస్పత్రి పైకప్పు పెచ్చులు ఊడిపడి, చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులను గాయపడ్డారు.ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు సొమవారం నాడు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, బీజేపీ నాయకులు ఎంజీఎం ఆసుపత్రికి చేరగా, ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా అడ్డుకోవాలని చూసిన పోలీసులతో బీజేపీ నాయకులకు మొదటగా తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ బీజేపీ శ్రేణులు ప్రమాదం జరిగిన ఆరోగ్యశ్రీ వార్డు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడి వాతావరణంలో రోగులు పడుతున్న ఇబ్బందులను, భవన శిథిలావస్థను చూసి నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అనంతరం గంట రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, స్థానిక ప్రజాప్రతినిధులపై నిప్పులు చెరిగారు. “స్థానిక కాంగ్రెస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేవలం వారి పదవులపై, కమిషన్లు వసూలు చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై, ప్రజల ప్రాణాలపై అస్సలు లేదు” అని ఘాటుగా విమర్శించారు. నిరుపేద ప్రజలకు అత్యాధునిక ఉచిత వైద్యం అందించాల్సిన ఆరోగ్యశ్రీ వార్డులోనే పైకప్పు కూలి రోగుల ప్రాణాల మీదకు రావడం అధికారుల, పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలను రోగాల బారి నుండి కాపాడాల్సిన ఎంజీఎం ఆసుపత్రి, ఈరోజు అధికారుల నిర్లక్ష్యం వల్ల తానే వెంటిలేటర్‌పై ఉన్న దుస్థితికి చేరింది. కనీస మౌలిక వసతులు ఈ ఆసుపత్రిని చూసి వరంగల్ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు అని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రోగులను కాపాడలేకపోతున్న ఇటువంటి నిర్లక్ష్యపు అధికారులపై మరియు వైద్య శాఖపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, జిల్లా కార్యదర్శిలు గోకే వెంకటేష్, వెంకట్ రావు, వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు టేకుమట్ల రేణుక, కూచన క్రాంతి కుమార్, ఎర్రగోళ్ల భరత్ వీర్, బిజెపి జిల్లా నాయకులు అంకాల జనార్ధన్, బైరి శ్యాంసుందర్, నోముల రతన్, గోగికార్ అనిల్,చిలువేరు రాజేందర్, మాచర్ల దీన్ దయాల్, గుర్రాల చంద్రమౌళి, గడ్డం మహేందర్, కర్నే రవీందర్, మందోటి మహేందర్, షేర్ల అనిల్, కోమాకుల నాగరాజు, మడిపల్లి నాగరాజు, మార్త ఉషారాణి, స్వర్ణజ, శైలశ్రీ, సుజాత, మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, సీతా నాగరాజు, రజనీష్ మరియు తాళ్లపల్లి శ్రీనివాస్, జెట్లింగ్ శివ, బోడకుంట్ల శివ, ఆడేపూ రవి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
