ePaper
Sunday, October 18, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండబతుకమ్మ, దసరా వేడుకలకు సర్వం సిద్ధం చేయాలి

బతుకమ్మ, దసరా వేడుకలకు సర్వం సిద్ధం చేయాలి

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌
బతుకమ్మ, దసరా ఉత్సవాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేసి, ఉత్సవ ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఉదయం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హసన్‌పర్తి, /భీమారం, వడ్డేపల్లి, బంధం చెరువు, పద్మాక్షి గుట్ట, పరిసరాలు, వరంగల్‌లోని ఉర్ గుట్ట, ప్రాంతాల్లో రంగలీల మైదానం తదితర ప్రధాన బతుకమ్మ, దసరా ఉత్సవ ప్రాంగణాలను కమిషనర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ పనులు, మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి, ఉత్సవాలకు వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ నెల 18వ తేదీన, అదేవిదంగా ఈ నెల 20వ తేదీన రంగలీల మైదానంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఉత్సవ ప్రాంగణాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన చోట్ల పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.ఉత్సవ ప్రాంతాల్లో ఇంకా ఏవైనా ఇంజనీరింగ్ పనులు, ఎలక్ట్రికల్, పారిశుద్ధ్య పనులు పెండింగ్‌లో ఉంటే వాటిని తక్షణమే పూర్తి చేయాలని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చాలని సూచించారు. అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు .

అనధికార ఫ్లెక్సీలు, బిల్‌బోర్డుల ఏర్పాటుపై చర్యలు

వరంగల్ మహానగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా నగరవ్యాప్తంగా అనధికారికంగా బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఇప్పటికే అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బిల్‌బోర్డులను తొలగించడం జరిగిందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిబంధనల ప్రకారం జరిమానాలు విధించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పండుగల సందర్భంగా నగరానికి వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు, ప్రధాన రహదారులు, కూడళ్లు, చెరువుల పరిసరాలు, ఉత్సవ ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్యం, సుందరీకరణ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు.బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు సంతోషంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కమిషనర్ స్పష్టం చేశారు.ఈ పర్యటనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంజయ్ కుమార్, మాధవీలత, మహేందర్, రవికుమార్‌తో పాటు ఇంజనీరింగ్, పారిశుద్ధ్య, టౌన్ ప్లానింగ్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!