ePaper
Sunday, October 18, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్భద్రకాళీ అమ్మ‌వారు భవానీ మాత గా అలంకరణ‌

భద్రకాళీ అమ్మ‌వారు భవానీ మాత గా అలంకరణ‌

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో దేవీశరన్నవరాత్రులు అరవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం నిత్యాహ్నికం నిర్వర్తించి అమ్మవారిని భవానీ మాత గా అలంకరించి పూజానాధలు నిర్వహించారు. ఎక్కడైతే భోగముందో అక్కడ మోక్షముండదు. ఎక్కడైతే మోక్షముంటుందో అక్కడ భోగముండదు. కానీ అమ్మవారి భక్తులకు భోగ మోక్షాలు రెండు కలుగుతాయని శాస్త్రం చెబుతున్నందున అమ్మవారిని భవానిగా అలంకరించడం జరిగినది. ఎందుకంటే అమ్మవారు శంకరుడికి భవాని రూపంలో సమస్త భోగాలనిస్తుందని శాస్త్రం చెబుతోంది. భవాని మాతగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకోవడం వలన నమస్త భోగాలు కలుగుతాయి. శుక్ర‌వారం రోజు అమ్మవారికి కాత్యాయని క్రమంలోను బోధాయనమహర్షిప్రోక్త నవరాత్రి కల్వాన్ని అనుసరించి ధూమ్రహా క్రమంలోను పూజారాధనలు జరిపారు. అట్లాగే ఈ రోజు అమ్మవారికి గంధోత్సవం నిర్వహించారు. “గంధవతీ పృథివీ” అని వృథ్వీ తత్వం గంధానికి ఈ గంధోత్సవాన్ని అమ్మవారికి మనం జరుపడం వలన అమ్మవారి భక్తులకు భూములు, వ్యవసాయక భూములు, గృహాలు, సమస్తమైనభూ సంబంధమైన ఆస్తిపాస్తులు నమకూరుతాయి. భూసంబంధిత చికాకులు తొలిగిపోతాయి. సాయంకాలం సాలభంజిక సేవ నిర్వహించారు. అమ్మవారు అఖిలాండకోటి బ్రహ్మోండ నాయకి 18 మెట్లపై ఒక్కొక్క శక్తి అమ్మవారిని ప్రశ్నిస్తుంటే వాటికి అమ్మవారు నమాధానం చెప్తూ ఒకొక్క మెట్టు అధిరోహిస్తూ నమస్తే బ్రహ్మూండాన్ని అధిరోహించింది. ఆ బ్రహ్మండాన్ని అధిరోహించింన ఆ జగన్మాతను దర్శించడం వల్ల సకలైశ్వర్య సంపత్తి, నకల రోగ నివృత్తి రాజద్వారమునందు. రాజ కార్యములందు విజయప్రాప్తి కలుగుతుందని ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు. ఈ రోజు శుక్రవారం కూడా కావడంతో ఉదయం నుండి భక్తులు అమ్మవారి దర్శనమునకు పోటెత్తారు.ఈ రోజు కార్యక్రమాలకు ఉభయదాతలుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎం.ఎల్.ఏ దాస్యం వినయభాస్కర్ -రేవతి దంపతులు, కసిరెడ్డి సోమిరెడ్డి కళావతి దంపతులు, మహేశ్వర్ రెడ్డి-గీతా దంపతులు వేముల రోజ, దంతాల అనీష్యలు వ్యవహరించారు.అమ్మవారిని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ వెంకన్న కుటుంబ సమేతంగా మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎన్.ఈ దుర్గాప్రసాద్ తదితరులు దర్శించుకున్నారు. పూజానంతరం మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి ప్రసాదములు అందజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు మరియు ప్రసాద వితరణలు దేవాలయ చైర్మన్ డాక్టర్ శివ సుబ్రహ్మణ్యం ధర్మకర్తలు కమటం వేణుగోపాల్ గాధే శ్రవణ్ కుమార్ రెడ్డి, రమేష్ చంద్ భంగ్, మాడిశెట్టి సతీష్, కారంగుల సురేష్ బాబు తదితరులు పర్యవేక్షించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!