ఆయుధం న్యూస్ హన్మకొండ
హనుమకొండ జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాలలో గ్రామ సమాఖ్య (వీవో )భవనాల నిర్మాణపనులను వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వీబీ-జీ రామ్ జీ, స్వచ్ఛ భారత్ మిషన్, వీవో భవనాల నిర్మాణ పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వీబీ-జీ రామ్ జీ పథకం అమలు తీరు, చేపట్టిన పనుల పురోగతి, వాటికి సంబంధించిన వివరాలను సమీక్షించారు. అదేవిధంగా, స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న పారిశుధ్య కార్యక్రమాల పురోగతిని, గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలకు గ్రామ సమాఖ్యల (వీవో) భవనాల నిర్మాణ పనుల ప్రస్తుత స్థితిగతులు, అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ సమాఖ్య భవనాల ఏర్పాటుకు సంబంధిత గ్రామపంచాయతీ తీర్మానం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో వీవో భవనం ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. అందుకు కావాల్సిన జీపీ తీర్మానం, సరైన స్థలం గుర్తింపు, ప్రతిపాదనలను అందజేయాలన్నారు. వివిధ గ్రామాలలో ప్రారంభమైన వీవో భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వీవో భవన నిర్మాణ పనులకు బిల్లుల చెల్లింపులు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు.ఈ సమీక్షా సమావేశానికి జడ్పీ సీఈఓ/ స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జిల్లా పంచాయతీరాజ్ ఈఈ రాజ్ గోపాల్ రావు, అడిషనల్ డీఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, పంచాయతీరాజ్ డీఈలు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఏఈలు, ఏపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
