ePaper
Monday, November 23, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండకార్తీక‌ మాస వనభోజనాల గోడ పోస్టర్ ఆవిష్కరణ

కార్తీక‌ మాస వనభోజనాల గోడ పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హన్మకొండ:
హన్మకొండ జిల్లా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించనున్న కార్తీక మాస సామూహిక వనభోజనాల కార్యక్రమ గోడ పోస్టర్‌ను ఆ సంఘం ముఖ్య అతిథులు లాంఛనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, సామూహిక వనభోజనాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమమే కాకుండా, కుల బాంధవులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఆత్మీయ సమ్మేళనమని పేర్కొన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో దూరమవుతున్న మానవ సంబంధాలను బలోపేతం చేయడానికి, ముఖ్యంగా నేటి యువత, పిల్లలకు మన సంప్రదాయాలు, ఐక్యత విలువలను తెలియజేయడానికి ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయని అన్నారు. పద్మశాలి సమాజం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలంటే అందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ నెల 29న జరిగే వనభోజనాలకు జిల్లాలోని పద్మశాలి కుటుంబాలన్నీ పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు, వరంగల్ జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, హన్మకొండ జిల్లా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బచ్చు ఆనందం, పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ ఆన్‌లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి వేముల సదానందం నేత, తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కొండా శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిపురం శేఖర్, స్వరాజ్ టీవీ సీఈఓ పులికంటి రాజేందర్ తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!