ePaper
Sunday, July 5, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండతొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి తరానికి ఆదర్శం: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్...

తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి తరానికి ఆదర్శం: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హనుమకొండ,
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం, ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని హనుమకొండ, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టిచాకిరీ, సామాజిక దోపిడీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన దొడ్డి కొమురయ్య తెలంగాణ ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.తెలంగాణ చరిత్రలో రైతాంగ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందని, మహనీయుల ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్,జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి ఆర్. సంపూర్ణ, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ చైర్మన్ అస్నాల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్, బీసీ సంఘం నాయకులు శ్యామ్ యాదవ్, మండల నరసింహారాములు, బోనగిరి రాములు, ప్రకాష్, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!