ePaper
Wednesday, August 5, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హనుమకొండ: ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయించాలని హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి అన్నారు.మంగళవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని లక్ష్మి ఫర్టిలైజర్ దుకాణాన్ని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా డిఏపి, ఇతర ఎరువుల నిల్వలను షాపు యజమాని తిరుపతిని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఫర్టిలైజర్ షాప్ కు ఎక్కడినుండి ఎరువులు విత్తనాలు వస్తుంటాయనే సమాచారాన్ని ఆరా తీశారు. ఇప్పటివరకు ఎన్ని యూరియా బస్తాలు విక్రయించారని, వాటికి సంబంధించిన రికార్డును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రవి మాట్లాడుతూ నిర్ణయించిన ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయించాలని అన్నారు. యూరియా, ఇతర ఎరువులు, రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఈ త‌నిఖీ కార్య‌క్ర‌మంలో తహశీల్దార్ విక్రమ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి సునీల్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!