ఆయుధం న్యూస్ కరీంనగర్
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భశాస్త్ర శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి,ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ కలిసి పాల్గొన్నారు.42 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించాను. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా గ్రామీణ యువత పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన సాంకేతిక విద్య, నైపుణ్య శిక్షణ పొందే అవకాశం కల్పించబడుతుందన్నారు.పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను యువత నేర్చుకోవడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడం వల్ల క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, ఇంటర్న్‌షిప్‌ల అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.తెలంగాణ యువతకు నైపుణ్యం, ఉపాధి, అభివృద్ధి అనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. ప్రతి జిల్లాను అభివృద్ధి కేంద్రంగా, ప్రతి యువకుడిని దేశ నిర్మాణంలో భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమఅగ్రవాల్ , జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే పాల్గొన్నారు.
