ePaper
Sunday, August 9, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండముప్పారం గ్రామ సభలో చేయూత పెన్షన్ దరఖాస్తులు స్వీకరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి..

ముప్పారం గ్రామ సభలో చేయూత పెన్షన్ దరఖాస్తులు స్వీకరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి..

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ ధర్మసాగర్
ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణపై ఏర్పాటు చేసిన గ్రామ సభలో , స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. చేయూత పెన్షన్ దరఖాస్తుదారులుదరఖాస్తు చేసుకోవాల్సిన విధానం, అందుకు సంబంధించిన విధివిధానాలపై స్థానిక సర్పంచ్ గుంటిపల్లి రేణుక, గ్రామ నాయకులతో చర్చించారు. ఈ సందర్బంగా జిల్లాలోనే మొట్ట మొదటి చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణనను ఆయ‌న‌ప్రారంభించారు.
చేయూత పెన్షన్ ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలకు వంద శాతం మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళల పెన్షన్లను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని ఎమ్మేల్యే సూచించారు. చేయూత పెన్షన్లు వితంతువులు, ఒంటరి మహిళలలు, వికలాంగులు, గీతా కార్మికులు, చేనేతకారులు, డయాలసిస్, ఫైలేరియా వ్యాధి అర్హులైన‌ గ్రామ‌స్థులు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన ధ్రువ పత్రాలు, విధి విధానాలను ప్లెక్సీ రూపంలో గ్రామ కూడళ్ళలో ఏర్పాటు చేయడంతో పాటు గ్రామంలో ప్రతీ ఒక్కరికీ తెలిసే విధంగా దండోరా వేయించాలని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరు కూడా చేయూత పెన్షన్ దరఖాస్తు చేసుకోవడంలో మిస్ కాకుకాడదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చేయూత పెన్షన్లను అర్హులైన ప్రతీ ఒక్కరు దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుంటిపల్లి రేణుక, మండల నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!