ePaper
Sunday, August 9, 2026
ePaper
Homeఆరోగ్యంపైడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజారెడ్డి

పైడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజారెడ్డి

📰 Generate e-Paper Clip

ఆయుధం స్యూస్ వ‌రంగ‌ల్
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజారెడ్డి పైడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలు, రికార్డుల, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను పర్యవేక్షించి, ఏ ఆర్ వి, ఎ ఎస్ వి వ్యాక్సిన్ల లభ్యత, నిల్వ విధానం మరియు వినియోగాన్ని పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. సీజనల్ వ్యాధులను నివారణ చర్యలు చేపట్టాలి, డ్రై డే, ఫీవర్ సర్వే లు నిర్వర్తించాలి అన్నారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో పనితీరును మెరుగుపరచాలని ఆదేశించారు.అనంతరం పైడిపల్లి పి ఎచ్ సి పరిధిలోని పైడిపల్లి సబ్ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఔట్ రీచ్ ఇమ్యునైజేషన్ సెషన్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పరిశీలించారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన రికార్డులను, సేవల నిర్వహణను పరిశీలించి, అర్హులైన పిల్లలు మరియు గర్భిణీలకు సకాలంలో టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించే దిశగా సమన్వయంతో పనిచేసి, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రాజారెడ్డి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!