ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeఎడిటోరియల్అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి: హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి: హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మునిసిఫ‌ల్ కార్పోరేష‌న్ ప్రత్యేక అధికారి హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు. శనివారం 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మునిసిఫ‌ల్ కార్పోరేష‌న్ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రత్యేక అధికారి హోదాలో ముఖ్య అతిథిగా హాజరై కమిషనర్ టి.వెంకన్నతో కలసి జాతీయ జెండాను ఎగురవేసి, వందనం సమర్పించి జాతీయ గీతం, జాతీయ గేయంతో పాటు రాష్ట్ర అవతరణ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేకాధికారి/ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
దేశభక్తి, సేవా స్ఫూర్తిని మన జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో జిడబ్ల్యూ ఎంసీను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు.
పరిశుభ్రమైన, సురక్షితమైన, అభివృద్ధి చెందిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనిని కలెక్టర్ ఆకాంక్షించారు.అనంతరం ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులు సిబ్బందికి ప్రత్యేకాధికారి,కమిషనర్ లు సంయుక్తం గా ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమం లో అదనపు కమిషనర్ జోనా,సూపరింటెండెంట్ రాజ్ కుమార్ ముఖ్య ఆరోగ్యాధికారి డా.రాజారెడి,ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్,అకౌంట్స్ అధికారి శివ లింగం డి ఎఫ్ ఓ శంకర్ లింగం ఇంచార్జి సి హెచ్ ఓ లక్ష్మారెడ్డి డిప్యూటీ కమిషనర్ లు ప్రసన్న రాణి సమ్మయ్య బిర్రు శ్రీనివాస్ సెక్రటరీ అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!