ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్టిపిసిసి క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుకు మంత్రి కొండా సురేఖ‌ వివరణ

టిపిసిసి క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుకు మంత్రి కొండా సురేఖ‌ వివరణ

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హైద‌రాబాద్
తెలంగాణ దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి మంత్రి కొండా జురేఖ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా “కొండా” కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు చేసుకున్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భాగంగా, కొండా సురేఖ స్వస్థలమైన గీసుకొండతో తనకున్న ప్రత్యేక అనుబంధంతో, అక్కడి అభిమానులు, కార్యకర్తలు నిర్వహించిన నా జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా నా కూతురు కొండా సుస్మితా పటేల్ పాల్గొన్నది.ఈ సందర్భంగా కొండా సుస్మిత‌ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన స్వంత అభిప్రాయాలకు సంబంధించినవి. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, వివరణ కోరడం తగదు. దీనికి నన్ను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని వినమ్రంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళి పై నాకు సంపూర్ణ గౌరవం ఉన్నది. కాబట్టిపై వాస్తవాలను, ప్రజాస్వామ్య విలువలను పరిగణనలోకి తీసుకుని, ఈ విషయంలో నా ప్రమేయం లేదని గుర్తించి, నాకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని గౌరవపూర్వకంగా కోరుతున్నానని మంత్రి కొండా సురేఖ టిపిసిసి క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవికి లేఖ‌లో వివ‌ర‌ణ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!