ఆయుధం న్యూస్ హన్మకొండ,
టీచర్ హత్య ఘటనపై తీవ్ర ఆందోళన.. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
రూపారెడ్డి ఉపాధ్యాయురాలు హత్యకు గురైన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగం పెరగకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని షైన్ స్కూల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీచర్స్ ప్రొటెక్షన్ ర్యాలీలో వక్తలు అన్నారు. ఈ సందర్భంగా షైన్ స్కూల్స్ చైర్మన్ ముగలా కుమార్ యాదవ్, మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై దాడులు, హింసాత్మక ఘటనలు సమాజానికి ఆందోళన కలిగించే అంశాలని పేర్కొన్నారు. విద్యార్థులు డ్రగ్స్‌కు బానిస కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. ప్రిన్సిపాల్ ప్రగతి రెడ్డి టీచర్స్ నీ కాపాడుకుందాం డ్రగ్స్ నీ నిర్ములద్దాం అనే నినాదంతో ర్యాలీ నిర్వహిస్తూ ఉపాధ్యాయుల భద్రతను కాపాడాలని, విద్యార్థుల భవిష్యత్తును డ్రగ్స్ నుంచి రక్షించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని, ఉపాధ్యాయులను గౌరవిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగాలని వారు సూచించారు. ఉపాధ్యాయుల రక్షణతో పాటు విద్యార్థుల భద్రతకు సమాజం మొత్తం బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
