ePaper
Tuesday, October 13, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్అన్నపూర్ణేశ్వరిగా భద్రకాళీ మాతకు అలంకరణ‌

అన్నపూర్ణేశ్వరిగా భద్రకాళీ మాతకు అలంకరణ‌

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
కాకతీయులనాటి శ్రీ భద్రకాళీ దేవస్థానంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవములు సోమావారం నాటికి రెండవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం వేకువ‌జామునే నిత్యాహ్నికం నిర్వర్తించిన తదుపరి అర్చకులు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి బ్రహ్మచారిణి, సాయంకాలం దేవజా దుర్గా క్రమాలలో పూజారాధనలు జరిపారు. ఉదయం మకర వాహన సేవ, సాయంకాలం చంద్రప్రభ వాహన సేవ పై ఊరేగించారు. నవదుర్గా క్రమంలోని బ్రహ్మచారిణి దుర్గా క్రమంలో ఆరాధింపబడిన అమ్మవారు సాధకుల దృష్టిని శరీరంలోని స్వాధిష్టాన చక్రంమీద కేంద్రీకరింపజేసి సాధకుడిని విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులను చేసి అధికారం, జ్ఞానం రెండింటినీ ప్రసాదిస్తుంది. దేవజా దుర్గా ఈమె సమస్త దేవతా కోవనంభూత, సాధకుడిని బాధిస్తున్న అసురీ శక్తులను దునిమి పారేస్తుందని ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు

.మకర వాహనం మీద అమ్మవారిని గంగాభవానిగాను, చంద్రప్రభ వాహనం మీద అమ్మవారిని రాజరాజేశ్వరిగాను అలంకరించారు. మకర వాహనం మీద గంగాభవానిగా అమ్మవారిని దర్శించడం వల్ల జలగండాలు దూరమవుతాయని అన్నారు.చంద్రప్రభ వాహనం మీద రాజరాజేశ్వరిగా ఊరేగుతున్న అమ్మవారిని దర్శించడం వల్ల సాధకుడు చంచలత్వాన్ని వీడి మనన్సు స్థిరమై సాధనలో నిమగ్నమవుతాడని అన్నారు.. మూడవ రోజు మంత్ర దీక్షకు సంకేతంగా అమ్మవారిని గాయత్రిగా అలంకరిస్తే ఆ మంత్ర దీక్షకు ముందు రెండవ రోజు సాధకుడి తల్లితో సహా భోజనం పెడతారని, దానికి సంకేతంగా రెండవ రోజు అన్నపూర్ణేశ్వరిగా అమ్మవారిని అలంకరించడంలోని నేపధ్యమ‌ని ఆయ‌న తెలిపారు. ఈ అన్నపూర్ణేశ్వరి అలంకారంలో వున్న అమ్మవారిని దర్శించడం వల్ల ఆకలి బాధలు దరిచేరవు. భక్తులకు మృష్టాన్నప్రాప్తి కలిగి అధిక కాలం సాధన కొరకు వెచ్చించే బుద్ధి ఏర్పడుతుందని పేర్కొన్నారు దేవాలయ మహామండపంలో మ‌హిళ‌లు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.సాయంకాలం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హరికథ, భక్తి సంగీతం, కర్ణాటక సంగీతం మరియు కూచిపూడి నృత్యాలు భక్తులను ఎంతగానో అలరించాయి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!