ePaper
Wednesday, October 14, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండభద్రకాళి చెరువు అవుట్ ఫాల్ రెగ్యులేటర్ పనులను వేగవంతం చేయాలి

భద్రకాళి చెరువు అవుట్ ఫాల్ రెగ్యులేటర్ పనులను వేగవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌
భద్రకాళి చెరువు వరద నీటి అవుట్ ఫాల్ రెగ్యులేటర్ పనులను వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు.మంగళవారం హనుమకొండలోని కాపువాడలో భద్రకాళి చెరువు కట్ట వద్ద చేపట్టిన నాలా విస్తరణ పనులను, భూ సేకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిగిలి ఉన్న భూ సేకరణ ప్రక్రియను, నాలా విస్తరణ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ నాలా విస్తరణకు సంబంధించిన చేపట్టిన పనులను వేగవంతం చేయడంతో పాటు మిగిలి ఉన్న భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ ప‌రిశీల‌న‌లో హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్, మున్సిపల్ ఎస్ఈ రాజ్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ రాంప్రసాద్, ఈఈ రవికుమార్, సీపీ రవీంద్ర రెడేకర్, ఈఈ కిరణ్ కుమార్, డీఈ మధుసూదన్ రెడ్డి, తహసిల్దార్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!