ఆయుధం న్యూస్ హన్మకొం
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో భూభారతి దరఖాస్తుల పరిష్కార చర్యలు, భూ రీసర్వే అంశాలపై జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి తో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లు, భూములు కొలతలు శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశంనిర్వహించారు.మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తహశీల్దార్లను ఆదేశించారు.సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మండలాల వారీగా భూభారతి దరఖాస్తుల పరిష్కార చర్యలు, భూ రీసర్వే అంశాలపై జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి తో కలిసి ఆర్డీఓలు, తహశీల్దార్లు, భూములు కొలతలు శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా ఇప్పటి వరకూ పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులు, భూముల రీ సర్వే వివరాలను తహసీల్దార్లు, అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ.. భూభారతి దరఖాస్తులు పెండింగ్ లో ఉండొద్దన్నారు. అదేవిధగా భూముల రీసర్వే ను మరింత వేగవంతం చేయాలని భూములు కొలతలు శాఖ అధికారులను ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు అందుబాటులో ఉన్న రోవర్లతో సర్వే ను గ్రామాలలో పూర్తి చేసేవిధంగా సర్వేయర్లు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, హనుమకొండ, పరకాల ఆర్డీఓ వెంకటేష్, డీఎస్. వెంకన్న, భూములు కొలతలు శాఖ ఏడీ నూర్ సింగ్, తహశీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
