ఆయుధం న్యూస్ హన్మకొం
హనుమకొండ జిల్లా రవాణా శాఖ కార్యాలయ శాశ్వత భవనానికి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సోమవారం స్థల పరిశీలన చేశారు. రవాణా, విద్యుత్, ఎస్సారెస్పీ శాఖల అధికారులతో కలిసి చింతగట్టు క్యాంపులో ఎస్సారెస్పీ భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న రవాణా శాఖ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. చింతగట్టు క్యాంపులో విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన ఉన్న ఎస్సారెస్పీ భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించి జిల్లా రవాణా శాఖ కార్యాలయం శాశ్వత భవనం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు.
ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఆధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ నిర్మాణానికి అవసరమైన భూమిని గుర్తించి, కేటాయించే అంశంపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. రవాణా శాఖ కార్యాలయం ఏర్పాటుకు ఏడు ఎకరాల భూమి అవసరమని రవాణా శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.చింతగట్టు క్యాంపులోని ప్రత్యామ్నాయ స్థలాన్ని మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అందుబాటులో ఉన్న భూమి విస్తీర్ణం, అనుకూలత వంటి అంశాలపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సురేష్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి జనార్దన్ రెడ్డి,
నీటిపారుదల శాఖ ఈ ఈ మంగీలాల్,డీఈ రవి, హసన్ పర్తి తహసీల్దార్ కిరణ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
