ఆయుధం న్యూస్ హన్మకొండ
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు పరిధిలో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిలో మధ్యాహ్న భోజనానికి చేసిన వంటలను భోజన పదార్థాల నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు.
బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యవసరాల నాణ్యతను తనిఖీ చేశారు. అదేవిధంగా విద్యార్థినుల డార్మెట్రీ గదులను, వాష్ రూమ్స్ ను పరిశీలించారు. విద్యార్థినులకు అందుబాటులో ఉన్న పుస్తకాలను పరిశీలించి వాటి గురించిన వివరాలను ప్రిన్సిపల్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ… హాస్టల్ లో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలన్నారు. వంటగది, భోజనశాల, డార్మెట్రీ, టాయిలెట్స్ నిర్వహణ మెరుగ్గా ఉండాలని, పరిశుభ్రత ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. దోమలు రాకుండా మెష్ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు
