ఆయుధం న్యూస్ హన్మకొండ
గ్రేటర్ వరంగల్ నగర పరిధి 44 వ డివిజన్ వర్డన్నపేట నియోజక వర్గం కడిపికొండ లో 17.95 లక్షల రూపాయాల అంచనా వ్యయం తో చేపట్టనున్న సి సి రోడ్డు,సి సి డ్రైన్ నిర్మాణ పనులను వర్ధన్నపేట శాసనసభ్యులు కే ఆర్ నాగరాజు జీ డబ్ల్యూ ఎం సి కమిషనర్ టి.వెంకన్న తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి నగరపాలక సంస్థ సూపరిండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
