ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్భ‌ద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్

భ‌ద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్

వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానమును సొమావారం నాడు బి.జె.పి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన నితిన్ నబీన్ కి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభం, మంగళవాద్యాలతో ఘనస్వాగతం పలికారు. ముందుగా వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ఆలయ మహామండపంలో మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ఆలయ స్థల పురాణం వివరించి ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో బి.జె.పి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు, కె. లక్షణ్, మార్తినేని ధర్మారావు, రావుపద్మ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాళీ ప్రసాద్, కొండేటి శ్రీధర్, గంటా రవికుమార్ అనేక మంది బి.జె.పి కార్యకర్తలు తదితరులున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!