ఆయుధం న్యూస్ హన్మకొండ
హనుమకొండ సుబేదారిలోని అసుంత నిలయం చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ ప్రాంగణంలో జిల్లా మహిళలు, దివ్యాంగులు వయో వృద్ధుల శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. బాలల దినోత్సవ వేడుకల్లో బాలలకు సంబంధించి సున్నితమైన అంశాలను చక్కటి సందేశం తో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించే విధంగా బాగున్నాయని ప్రశంసించారు. బాలల దినోత్సవ వేడుకలను ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించగా చిన్నారుల సంతోషాన్ని కలెక్టర్ మరింత రెట్టింపు చేశారు. బాలికలు తమతో కలిసి నృత్యం చేయాలని కోరగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి వారితో కలిసి నృత్యం చేసి బాలల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. తమతో కలిసి కలెక్టర్ నృత్యం చేయడంతో బాలికలు ఆనందంతో కేరింతలు పెట్టారు. కార్యక్రమం ప్రారంభంలో బాలికలు పలు గీతాలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి
