ePaper
Friday, August 14, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అంతపురంఘనంగా చౌడేశ్వరి అమ్మవారి బోనాల పండుగ

ఘనంగా చౌడేశ్వరి అమ్మవారి బోనాల పండుగ

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి సందర్భంగా చౌడేశ్వరి అమ్మవారి బోనాల పండుగను ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి సవిత పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలపై, నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి సవిత ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా భక్తులతో కలిసి మంత్రి సవిత బోనాలను మోశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. చౌడేశ్వరి అమ్మవారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ఆలయ ధర్మకర్తలు, దాతలు, భక్తులను మంత్రి సవిత అభినందించారు. ప్రజలందరికీ చౌడేశ్వరి అమ్మవారి కృపాకటాక్షాలు లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!