ePaper
Monday, November 23, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండతెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన వరంగల్ కాంగ్రెస్ వైఫ‌ల్యాల‌పై అదే స్ఫూర్తితో 22న‌కేటీఆర్ సభ..

తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన వరంగల్ కాంగ్రెస్ వైఫ‌ల్యాల‌పై అదే స్ఫూర్తితో 22న‌కేటీఆర్ సభ..

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌
గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌రంలో నవంబర్ 22న ఆదివారం రోజున కేడీసీ గ్రౌండ్ లో నిర్వహించనున్న జన చైతన్య సభ నేపథ్యంలో సభా స్థలిని బీఆర్ఎస్ నేత‌లు , మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాజీ ఎమ్మెల్యేలు విన‌య్ బాస్క‌ర్, ఆరూరి ర‌మేష్, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, మాజీ చైర్మన్లు,మాజీ కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో వరంగల్ నగరానికి ప్రత్యేక స్థానం ఉందని, ఉద్యమానికి నగరం ఎప్పుడూ అండగా నిలిచిందని గుర్తుచేశారు.ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి నూతన ఉత్తేజాన్ని అందించిన ఇదే ప్రాంగణంలో ఆదివారం కేటీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను ఆయ‌న‌ పంచుకున్నారు.2001 ఏప్రిల్ 27న గులాబీ జెండా ఆవిష్కరణ అనంతరం కరీంనగర్‌లో నిర్వహించిన సభతో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందని తెలిపారు. అనంతరం వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వరంగల్‌లో నిర్వహించిన సభలు కూడా ఉద్యమానికి ఎంతో ఊపునిచ్చాయని గుర్తుచేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో కేసీఆర్‌తో పాటు తాము పార్లమెంట్ సభ్యులుగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎదురైన ఆటుపోట్లలో వరంగల్ నగరానికి వచ్చి స్థానిక నాయకులు, మేధావులు, పత్రికా ప్రతినిధులతో చర్చించేవారమని తెలిపారు. వారి అభిప్రాయాలు, మద్దతు కేసీఆర్‌కు నూతన ఉత్సాహాన్ని అందించేవని పేర్కొన్నారు.వరంగల్ నగర ప్రజలు, రాజకీయ నాయకులు, మేధావులు తెలంగాణ ఉద్యమానికి అందించిన సహకారం మరువలేనిదన్నారు. అదే చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంగణంలో ఇప్పుడు కేటీఆర్ సభ జరగడం విశేషమని పేర్కొన్నారు.
ఈ సభకు వరంగల్ నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటేలా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 22న‌ నిర్వహించనున్న కేటీఆర్ జన చైతన్య సభ ఈ రాజకీయ ప్రయాణంలో ఒక ముందడుగు మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని సభలు నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…. కాంగ్రెస్‌లో నాయకులు, ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారుప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం అయింన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితి కూడా లేదని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి నెలకొందని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, మేధావులు బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుత పాలనపై ప్రజలతో పాటు అధికార పార్టీ నాయకుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితులను గుర్తించి రైతులు, పట్టణ ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.

ఈ సందర్భంగా, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్…. మాట్లాడుతూ ఈసభకు సుమారు 20 వేల మంది వస్తారని తొలుత అంచనా వేసినప్పటికీ, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే అంతకుమించిన స్థాయిలో జనసమీకరణ జరిగే అవకాశం ఉందన్నారు.కేటీఆర్ ప్రసంగాన్ని వినేందుకు వేలాదిగా ప్రజలు తరలిరానున్నారని, సభా ప్రాంగణం కూడా సరిపోని పరిస్థితి ఏర్పడవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇతర పార్టీలకు చెందిన నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు, పలువురు ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.గత మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పదేళ్ల పాలనలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు.

వ‌ర్ధ‌న్నపేట‌ మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ మాట్లాడుతూ….. ప్రజలను చైతన్యపరిచేందుకే జన చైతన్య సభ
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం,గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అభయహస్తం హామీలను అమలు చేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. అయితే మూడేళ్ల పాలన పూర్తవుతున్నా హామీల అమలులో ఆశించిన పురోగతి లేదని విమర్శించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం ఉద్యమ నాయకుడు కేసీఆర్ పదేళ్లపాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవం రావాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడమే జన చైతన్య సభ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సభలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, మేధావులు, విద్యావేత్తలు బీఆర్ఎస్‌లో చేరనున్నారని వెల్లడించారు.కార్మికులు, కర్షకులు, యువత, మేధావులు, విద్యావేత్తలు, పత్రికా మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!