ఆయుధం న్యూస్ వరంగల్,:
గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రతి సర్పంచ్ ప్రధాన లక్ష్యంగా ఉండాలని, గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.శనివారం గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GPDP) కింద సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారదతో పాటు అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచులు గ్రామ ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధిగా లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఐదేళ్ల పదవీకాలంలో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రజల విశ్వాసం, మన్ననలు పొందాలని అన్నారు.గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళిని ఆదర్శంగా తీసుకుని గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సమర్థవంతంగా వినియోగించి, గ్రామ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. ప్రజలకు అత్యవసరమైన అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్య, పచ్చదనం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులకు తక్కువ నీటితో సాగు చేసే పంటలు, పంటల మార్పిడి విధానం, సేంద్రియ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యుత్ తో పాటు పౌష్టిక ఆహారం అందించుటలో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుందని ఇట్టి విషయాన్ని ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రతి ఒక్క కుటుంబము కృషి చేయాలని వారు పేర్కొన్నారు. వర్ష బాగా పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేయడంతో పాటు మొక్కలు విరివిగా నాటి పర్యావరణాన్ని కాపాడుటలో ప్రతి ఒక్కరూ కృషి చేసేందుకు గ్రామ సర్పంచులు బాధ్యత తీసుకొని వారి గ్రామాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే సర్పంచ్ లను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర ఓటర్ ఇంటింటి సర్వే జరుగుతుందని,ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలన్నారు. 7 రకాల వరి వెరైటీలను తక్కువ కాలం ,తక్కువ నీటి తో పండించే పంటలను పండించాలన్నారు.ఎ ఒక్క రైతు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత మనది.ప్రస్తుత పరిస్థితుల్లో
నువ్వులు , కందులు,మినుములు,బంతి పూలు, తదితర పంటలకు వేసి తక్కువ సమయంలో పంట చేతికి వచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండేందుకు జల శక్తి అభియాన్ ద్వారా గత సంవత్సరం వరంగల్ జిల్లాకు కోటి రూపాయల కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చాయని, ఈ సంవత్సరం కూడా వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు సోక్ ఫిట్, ఫామ్ ఫౌండ్, వర్షపు నీటిని నిలువ ఉంచే తదితర వాటిని ఏర్పాటు చేసి భూగర్భ జలాలను కాపాడాలని అన్నారు.మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుటలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ రాంరెడ్డి, డిపిఓ కల్పన, డి ఆర్ డి ఓ నాగ పద్మజ, సంబంధిత అధికారులు సర్పంచులు పంచాయతీ సెక్రటరీలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో కలిసి జలసిరి ప్రతిజ్ఞ చేశారు
