ePaper
Sunday, August 30, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వరంగల్
దివంగత నేత ఉమ్మాడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జన్మదిన వేడుకలు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోనీ పోచమ్మ మైదానం సెంటర్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అయూబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ,రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎరబెల్లి స్వర్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బస్వరాజు సారయ్య ఎరబెల్లి స్వర్ణలు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేదల సంక్షేమం కోసం నిరంతరం తాపత్రయపడ్డారని, రైతులకు ఉచిత కరెంటు, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ లాంటి పథకాలు ఎన్నో తీసుకొచ్చి పేదల అభ్యున్నతికి పాటుపడ్డారని పేర్కొన్నారు. రాజకీయంగా మేము తెలంగాణ వాదుల మైనప్పటికీ, రాజశేఖర్ రెడ్డి వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రంగశాయిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు, వరంగల్ శాశ్వత మంచినీటి పథకానికి, రాజీవ్ గృహకల్ప కింద ఇండ్లను తదితర పథకాలను మంజూరు చేసి శంకుస్థాపన చేసిన మహనీయులు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజశేఖర్ రెడ్డి వారసులమని చెప్పుకునే పెద్దలు, గతంలో దేశాయిపేట దూపకుంట లో పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ పట్టాల లబ్ధిదారులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్ రూములు మంజూరు చేయించి ఇచ్చినప్పుడే వైయస్ రాజశేఖర్ రెడ్డికి నిజమైన నివాళులు అర్పించిన వారవుతారని ఆ విధంగా లబ్ధిదారులకు, లబ్ధి చేకూర్చే చర్యలు తీసుకోవాలని కోరినారు.ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు నల్లగొండ రమేష్, మాజీ కార్పొరేటర్లు గుండేటి నరేంద్ర కుమార్, బసవరాజు శిరిష శ్రీమన్, తత్తరి లక్ష్మణ్, జన్నుఅరుణ్, దామెర సర్వేశం, ధూపం సంపత్ , జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కురివి పరమేశ్వర్, తూర్పు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సలీం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంట్ల రాజు, జన్ను రవి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సోమలక్ష్మి, గిరి గిరి పుష్ప ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండి బజార్ మర్చంట్ అధ్యక్షులు ఎండి మాషుక్, ఓబీసీ కోఆర్డినేటర్ కోదాటి అనిల్, ఎన్ఎస్ యూఐ నగర మాజీ అధ్యక్షుడు చాగంటి శ్రీనివాస్, బొలుగొడ్డు శ్రీనివాస్, సందెల దామోదర్, బత్తిని లింగయ్య, నరిగే శ్రీను తోట బాలరాజు, మార్త ఆంజనేయులు, రామ యాదగిరి, బోలుగోడ్డు అనిల్, గుత్తికొండ తిరుపతి,బత్తుల వినోద్, గజ్జెల లింగమూర్తి, ఎండి కమాలుద్దీన్, పెండ్యాల కొమురయ్య, నటరాజు శ్రీధర్, ఇనుగాల బాబు, డివిజన్ అధ్యక్షుడు కొమ్ముల సందీప్, సన్నీ , గుండేటి సతీష్ వస్కుల ఉదయ్, బండ్ల సురేందర్ జిన్నారపు రాజు, ఆదాం, కుసుమ మురళి తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!