ఆయుధం న్యూస్ వరంగల్
ఓరుగల్లు నగరంలోని చారిత్రాత్మక
శ్రీభద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు అత్యంత ఘనంగా బుధవారం నాడు ప్రారంభమయ్యాయి.ఈ వేడుకల కోసం భక్తులు విశేషంగా అమ్మవారిని శాకంబరి రూపంలో దర్శించుకుంటారు. అమ్మవారిని అద్భుతంగా అలంకరించేందుకు సుమారు వివిద రకాలైన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా, పచ్చని ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారిని అలంకరించారు.ఉదయం నుంచి భక్తులకు శ్రీభద్రకాళి అమ్మవారి శాకంబరి విశ్వరూప దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయప్రధానార్చకులు శేషు తెలిపారు. ప్రకృతి ప్రసాదించిన విభిన్న ఫలాలు, కూరగాయలతో దర్శనమిచ్చే అమ్మవారిని సేవించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఈ శాకంబరి దర్శనం వల్ల లోకకళ్యాణం, సుభిక్షం కలుగుతాయని విశ్వసిస్తారని అర్చకులు తెలిపారు

