ePaper
Thursday, July 30, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్త్వరలో... నూతన భవనంలోకి వరంగల్ ఎరువుల పరీక్ష కేంద్రం

త్వరలో… నూతన భవనంలోకి వరంగల్ ఎరువుల పరీక్ష కేంద్రం

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలో  ఆధునిక పద్ధతిలో వ్యవసాయ ఎరువుల పరీక్ష కేంద్రాన్ని ప్రభుత్వ నూతన భవనంలోకి మారనుంది అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ  రాష్ట్రంలో రాజేంద్రనగర్ తర్వాత వరంగల్‌లో ఏర్పాటు చేసిన రెండో ఎరువుల పరీక్షా కేంద్రం (FCO ల్యాబ్) నూతన భవనాన్ని ప్రారంభోత్సవానికి అన్ని విధాలుగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్  సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం పైడిపల్లి రైతు శిక్షణ కేంద్రం ఆవరణలో నూతనంగా నిర్మించిన ఎరువుల పరీక్షా కేంద్ర భవనాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా భవనంలోని ప్రయోగశాల గదులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి నిర్మాణంలో ఉన్న లోపాలను గుర్తించారు.భవనంలో అవసరమైన మార్పులు, చేర్పులు వెంటనే పూర్తి చేసి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రారంభోత్సవానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా భవనాన్ని సిద్ధం చేయాలని సూచించారు.ప్రస్తుతం ప్రైవేట్ భవనంలో పనిచేస్తున్న ఎరువుల పరీక్షా కేంద్రాన్ని  ఈ నూతన భవనానికి తరలించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.భవన నిర్మాణంలో ఉన్న అన్ని లోపాలను పూర్తిగా సరిచేసి, చేపట్టిన చర్యలపై సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని పంచాయతీ రాజ్ శాఖ డివిజనల్ ఇంజనీర్ (డీఈ)ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ పరిశీలనలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి (DHSO), జిల్లా వ్యవసాయ అధికారి (DAO), పంచాయతీ రాజ్ శాఖ డివిజనల్ ఇంజనీర్ (డీఈ)తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!