ePaper
Thursday, July 30, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండహోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక సహాయం చెక్కును అందచేసిన పోలీస్ కమీషనర్

హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక సహాయం చెక్కును అందచేసిన పోలీస్ కమీషనర్

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వరంగల్
ఆకస్మికంగా  మరణించిన హోంగార్డ్ కుటుంబానికి వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత చేతుల మీదుగా  ఐదు లక్షల ఆర్ధిక సహాయం చెక్కును బుధవారం సీపీ కార్యాలయంలో అందజేశారు. రాష్ట్ర పోలీస్ శాఖకు సహాయ సహకారాలను అందిస్తున్న హోంగార్డ్స్ ఆకస్మికంగా గాని లేదా ప్రమాదాల్లో మరణిస్టే సిబ్బంది కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని, మరణించిన హోంగార్డ్స్  కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించాలని రాష్ట్ర పోలీస్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా దుగ్గొండి పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తూ గత ఏడాది ఆకస్మికంగా మరణించిన పి. శ్రీనివాస్ రెడ్డి భార్యకు పోలీస్ కమిషనర్ ఆర్థిక చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో  ఎ.ఆర్ అదనపు డీసీపీ శ్రీనివాస్, హోంగార్డ్స్ ఆర్ ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!