ePaper
Friday, July 31, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండవిద్యార్థులను చదవడం, రాయడంలో ఉత్తమంగా ఉండేలా తీర్చిదిద్దాలి

విద్యార్థులను చదవడం, రాయడంలో ఉత్తమంగా ఉండేలా తీర్చిదిద్దాలి

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌
విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా, చదవడం, రాయడం, భావవ్యక్తీకరణలో మెరుగైన నైపుణ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.గురువారం హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల కుమారిని కలెక్టర్ పాఠశాలలో ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంతమంది కొత్తగా ప్రవేశాలు పొందారని అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు.పాఠశాలలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఇన్-సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. శిక్షణలో ఉపాధ్యాయులకు బోధనలో అనుసరించాల్సిన ఆధునిక పద్ధతులు, విద్యార్థి కేంద్రిత అభ్యాస విధానాలు, ప్రాథమిక భాషా మరియు గణిత నైపుణ్యాల పెంపు, నిరంతర మూల్యాంకన విధానాలపై అందిస్తున్న శిక్షణను పరిశీలించి ఉపాధ్యాయులతో చర్చించారు.పాఠశాలలో ఉన్న లైబ్రరీని పరిశీలించారు. వంటగదిని పరిశీలించి విద్యార్థుల కోసం వండుతున్న భోజన పదార్థాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న టాయిలెట్స్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాలలోని ఏడో తరగతి విద్యార్థులకు భారతరత్న సర్ సివి రామన్ సంబంధించి ఆంగ్ల పాఠ్యాంశం ఉపాధ్యాయురాలు బోధిస్తుండగా కలెక్టర్ తరగతి గదిని సందర్శించారు. ఏ పాఠ్యాంశాన్ని చదువుతున్నారని విద్యార్థులను కలెక్టర్ అడగగా సివి రామన్ లెసన్ అంటూ బదులిచ్చారు. హూ వాజ్ సీవీ రామన్ అని ఆంగ్లంలో కలెక్టర్ అడుగగా గ్రేట్ సైంటిస్ట్ అంటూ విద్యార్థులు ఆంగ్లంలోనే సమాధానం ఇచ్చారు. దీంతో వెరీ గుడ్ అంటూ విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.

ఆంగ్లంలో ఉన్న ఆ పాఠ్యాంశాన్ని విద్యార్థుల చేత కలెక్టర్ చదివించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ విద్యార్థులు విద్యా ప్రగతిలో ఉత్తమంగా నిలవాలంటే పాఠ్యాంశాన్ని బోర్డు మీద రాయడం కాకుండా డిక్టేషన్ గా ఉపాధ్యాయులు చెప్పడం ద్వారా విద్యార్థులు సొంతంగా రాయడం, చదవడంపై పట్టు సాధించగలరని అన్నారు. విద్యార్థులను ఇంగ్లీషులో బాగా రాయడం, చదవేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూర్ గ్రామ సర్పంచ్ మహేశ్వరి, ఎంఈఓ విజయ్ కుమార్, తహసీల్దార్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!