ePaper
Friday, July 31, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాటించాలి: అదనపు కమిషనర్ జోనా

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాటించాలి: అదనపు కమిషనర్ జోనా

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గురువారం అదనపు కమిషనర్ ఈసంపల్లి జోనా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈసందర్భంగా వివిధ విభాగాలను సందర్శించి సిబ్బంది హాజరు నమోదులు, కార్యాలయ రికార్డులను పరిశీలించారు.అధికారులు,ఉద్యోగులు కార్యాలయ సమయపాలన తప్పనిసరిగా పాటిస్తూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు.ప్రజల నుంచి వచ్చే వినతులను సకాలంలో పరిష్కరించి, పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పూర్తి చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అదనపు కమిషనర్ ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!