ePaper
Sunday, August 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్డిజిటల్ యుగంలో వెబ్ వినియోగం, సైబర్ భద్రతపై విద్యార్థులకు అవగాహన

డిజిటల్ యుగంలో వెబ్ వినియోగం, సైబర్ భద్రతపై విద్యార్థులకు అవగాహన

📰 Generate e-Paper Clip

పాలకొల్లు:ప్రపంచ వ్యాప్త వెబ్ ఆవిర్భావం, ఇంటర్నెట్ సాంకేతికత అభివృద్ధిలో వెబ్ పాత్ర, డిజిటల్ యుగంలో వెబ్ వినియోగం, సైబర్ భద్రత, సమాచార మార్పిడిలో వెబ్ ప్రాధాన్యత వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్రంగా వీరవల్లి ఎం.కె ప్రసాద్ విరించారు.ప్రపంచ వ్యాప్త వెబ్ దినోత్సవం (World Wide Web Day) సందర్భంగా పాలకొల్లులోని  అద్దేపల్లి సత్యనారాయణమూర్తి  కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న వీరవల్లి ఎం.కె ప్రసాద్ ప్రపంచ వ్యాప్త వెబ్ ఆవిర్భావం, ఇంటర్నెట్ సాంకేతికత అభివృద్ధిలో వెబ్ పాత్ర, డిజిటల్ యుగంలో వెబ్ వినియోగం, సైబర్ భద్రత, సమాచార మార్పిడిలో వెబ్ ప్రాధాన్యత వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. నేటి విద్య, ఉపాధి, పరిశోధన ఆవిష్కరణలలో వెబ్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం మాట్లాడుతూ, సమాచార సాంకేతిక రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి విద్యార్థులు వెబ్ సాంకేతికతలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే సమయంలో డిజిటల్ వనరులను బాధ్యతాయుతంగా, సురక్షితంగా ఉపయోగించడం ప్రతి విద్యార్థి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్  కృష్ణ, ఐక్యూఏసి కోఆర్డినేటర్  వెంకటస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్  సుమలత, కంప్యూటర్ అప్లికేషన్స్  అధ్యాపకులు  రవికుమార్, అధ్యాపకులు  రామకృష్ణ, విజయలక్ష్మి, వేణు మాధురి   విద్యార్థులు  పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!