ఆయుధం న్యూస్ వరంగల్
ఓరుగల్లు గడ్డపై రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు నడుం బిగించాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పిలుపునిచ్చారు.శనివారం ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల కార్య నిర్వహణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ , రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్, గురుమూర్తి శివకుమార్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే పరమావధిగా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో కష్టపడాలని కోరారు.ఎన్నికల్లో గెలుపునకు బూత్ కమిటీలే కీలకమని, ప్రతి బూత్‌లో కమిటీలను పటిష్టం చేసి ఓటర్లతో నిరంతరం టచ్‌లో ఉండాలని ఆదేశింఅర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, తప్పులను సవరించేలా బీజేపీ శ్రేణులు బూత్ స్థాయిలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను వంద శాతం అయ్యే విధంగా బాధ్యతగా చేపట్టాలని పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, స్థానిక మున్సిపాలిటీల్లో జరుగుతున్న అవినీతి, వైఫల్యాలను ఎండగట్టేలా బూత్ స్థాయిలో విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వరంగల్ మున్సిపల్ అభివృద్ధి హామీలను, నిధుల కేటాయింపులను గాలికొదిలేసిందని మండిపడ్డారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను బూత్ స్థాయి నుంచి ఎండగడుతూ, ప్రజల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు.ఓరుగల్లు కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరవేయడమే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, సర్పంచ్ కన్నయ్య, జిల్లా పదాదికారులు, మండల అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జీలు, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జీలు, వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
