ఆయుధం న్యూస్ హన్మకొండ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పై అంతస్తులో నిర్వహించబడుతున్న హనుమకొండ మహిళా పోలీస్ స్టేషన్ ను భీమారంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ భవనానికి మార్చబడినదని వరంగల్ పోలీస్ కమీషనర్ శ్వేత తెలిపారు.
మహిళలకు, ఫిర్యాదుదారులకు పోలీస్ సేవలు మరింత సులభంగా అందుబాటులో ఉండేలా ఈ చర్య తీసుకున్నారు , సుబేదారి పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీస్ స్టేషన్ ను నిర్వహించడానికి సరిపోవడం లేదు, అలాగే ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి స్థలం సరిపోవడం లేక పోవడం వల్ల, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది, విశాలమైన ప్రాంగణం లో మహిళా పోలీస్ స్టేషన్ ను , సర్వోదయ సంస్థ ఆధ్వర్యం లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.నవంబర్ 1వ తేదీ నుంచి హనుమకొండ మహిళా పోలీస్ స్టేషన్ నూతన ప్రాంగణం నుంచి ప్రజలకు సేవలు అందిస్తుంది. ప్రజలు ఈ మార్పును గమనించి, నవంబర్ 1వ తేదీ నుంచి భీమారంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ భవనంలో హనుమకొండ మహిళా పోలీస్ స్టేషన్ సేవలను పొందగలరని పసూచించారు.
