ePaper
Friday, November 20, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండసంక్షేమంలో మహిళలకు అగ్రస్థానం

సంక్షేమంలో మహిళలకు అగ్రస్థానం

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌
హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, జిడబ్ల్యూఎంసి కమిషనర్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో మహిళలకు అగ్రస్థానం కల్పిస్తుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజి కళాక్షేత్రంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన చేయూత పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, తదితరులు హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించి. రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. మహిళల సాధికారత సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. మహిళల అభ్యున్నతికి చేపడుతున్న ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సానుకూల మార్పులు తీసుకొస్తుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులందరికీ చేయూత పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.


ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ
గతంలో సంక్షేమ పథకాల కోసం ప్రజలు ప్రజాప్రతినిధుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి అధికార యంత్రాంగమే నేరుగా వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్లు మంజూరు చేసే విధానానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి ఒకే రోజు 2,698 మందికి పెన్షన్ల మంజూరు పత్రాలు అందించడం ప్రజాపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలు, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయని ఎమ్మెల్యే వివరించారు. సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు, ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తున్నామని చెప్పారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే 5,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, అర్హులైన మిగతా లబ్ధిదారులకు కూడా దశలవారీగా ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఒకేసారి మంజూరు చేయడం సాధ్యం కాదని, అర్హత ఆధారంగా విడతలవారీగా అందిస్తామని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలం ఉన్న అర్హులకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే విధానాన్ని కూడా వివరించారు. పేదల గృహ అవసరాలను తీర్చేందుకు కొత్తగా టవర్స్ నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టామని తెలిపారు.పెన్షన్ల మంజూరులో ఎలాంటి రాజకీయ వివక్షకు తావులేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.లబ్ధిదారుల నుంచి పెన్షన్లు లేదా ఇతర సంక్షేమ పథకాల మంజూరు కోసం ఎవరైనా ఒక్క రూపాయి డిమాండ్ చేసినా సహించేది లేదని హెచ్చరించారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా అర్హులైన ప్రజలకు చేరాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే తన క్యాంపు కార్యాలయానికి లేదా స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇప్పటికే పెన్షన్లు మంజూరైన వారితో పాటు ఇంకా అర్హత ఉండి పెన్షన్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, క్యాంపు కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం లేదా మున్సిపల్ అధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకువస్తే పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజులు ఆలస్యమైనా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూసే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ .. కాళోజి కళాక్షేత్రంలో చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం… వేలాదిగా వచ్చిన లబ్ధిదారులతో ఒక పండగ వాతావరణంలా కనిపిస్తుందన్నారు. కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వితంతు, వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్ల కోసం అనేక దరఖాస్తులు వస్తుంటాయని పేర్కొన్నారు. వారందరికీ పింఛన్లు మంజూరు అవుతుండడంతో లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. పింఛన్ల మంజూరు నిరంతర ప్రక్రియగా సాగుతుందన్నారు. ప్రభుత్వం అందించే పింఛన్లు కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో సహాయకరంగా నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి. అజీజ్ ఖాన్, జిడబ్ల్యూ ఎంసి కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, ఇతర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!