ePaper
Tuesday, June 23, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండపదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం.. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో సంక్షోభం.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం.. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో సంక్షోభం.

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హన్మకొండ
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం జరుగగా రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో సంక్షోభం దిశగా మారిందని వచ్చే ఐదేళ్లు కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే బాధ్యత నేను తీసుకుంటానని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.వర్థన్నపేట నియోజకవర్గస్థాయి ఎస్ఐఆర్ ప్రక్రియపై బిఆర్ఎస్ పార్టీ నాయకులకు అవగాహన కార్యక్రమం గ్రేటర్ వరంగల్ నగరం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ లో వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మేల్యే అరూరి రమేష్ అధ్యక్షతన నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఎస్ఐఆర్ ప్రక్రియ, డిజిటల్ మెంబర్‌షిప్ (సభ్యత్వ నమోదు) సోషల్ మీడియాపై నిర్వహించిన శిక్షణ తరగతులలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ఇంటింటా సంక్షోభం తెచ్చిందని పంటల కొనుగోళ్లపై రేవంత్ రెడ్డి రైతులకు మరణ శాసనం రాసిండనిఒకప్పుడు కేంద్రం చెప్తే వినడానికి మోడీ బ్రోకరా అన్న రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే పని చేస్తున్నాడని మోడీ చెప్పినంతనే పంట కొంటాం అంటున్నడు రేవంత్ రెడ్డి వచ్చే సీజన్ నుంచి రైతన్నల పంటలు కొనే నాథుడే ఉండరని తెలిపారు. రెండున్నర సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మంచి పని కాంగ్రెస్ చేయలేదని చెప్పారు. కార్యకర్తలను పార్టీ నేతలను వేధించే రేవంత్ రెడ్డినికాంగ్రెస్ నేతలను, అధికారులను వదిలిపెట్టేదే లేదు అని హెచ్చరించారు. అరూరి రమేష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఐర్ ప్రక్రియపై ప్రజలకు సరైన అవగాహన కల్పించి, ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు, పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే పాడీ కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, టి. రాజయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు సతీష్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, బిఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, లలిత యాదవ్ గార్లు మరియు మాజీ వర్ధన్నపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!