ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హైదరాబాద్
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్‌బెడ్‌లో ఉన్న వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలని సమావేశంలో ముఖ్యమంత్రి  అధికారులను ఆదేశించారు.ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి,ఎంపీ వేం నరేందర్ రెడ్డి  ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో మూసీ మొదటి దశ ప్రాజెక్ట్ పైన అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టులో భాగంగా అవసరమైన చోట భూ సేకరణ కోసం ఆసక్తి ఉన్న వాళ్లకు టీడీఆర్ ఇవ్వాలి లేదా పరిహారం చెల్లించాలని చెప్పారు.గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న రక్షణ శాఖ భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాల్సి ఉంటుందని తెలిపారు.అలాగే నెక్లెస్ రోడ్డులో ప్రజల సందర్శనార్థం మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి  సూచించారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టబోయే పనులను ఆ ఎక్స్‌పీరిన్స్ సెంటర్‌లో ప్రతిబింబించాలని చెప్పారు. ప్రాజెక్టుపైన ఈ సందర్భంగా ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!