ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ దుర్గమ్మకు భక్తులు లక్ష్మీ కాసుల హారాన్ని సోమవారం సమర్పించారు. భక్తులు దొండేటి ఐశ్వర్య జ్యోతి, కుటుంబ సభ్యులు అమ్మవారికి 108 గ్రాముల బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని బహూకరించారు.లక్ష్మీ కాసుల హారం విలువ రూ. 17 లక్షలు విలువ చేస్తుందని దాతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు దాతల కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
విజయనగరానికి చెందిన భక్తులు దుర్గమ్మకు ఆదివారం బంగారపు నత్తు, బొట్టు, బొల్లాకిని కానుకగా సమర్పించారు. విజయనగరం జిల్లా గాజులరేగడకు చెందిన కె.సత్యనారాయణ, అప్పాయమ్మ దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూ. 2.5 లక్షల విలువైన 19 గ్రాముల బంగారంతో చేసిన బొట్టు, నత్తు, బొల్లాకిని తయారు చేయించి ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
కనకదుర్గమ్మకు కాసుల హారం. 17 లక్షల విలువైన బంగారాన్ని అందించిన భక్తులు
RELATED ARTICLES
