ePaper
Sunday, November 1, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్మేకల రవి మృతి సిపిఐకి తీరని లోటు : కూనంనేని సాంబశివరావు

మేకల రవి మృతి సిపిఐకి తీరని లోటు : కూనంనేని సాంబశివరావు

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వరంగల్ : సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల రవికి ప్ర‌జ‌లు శనివారం వరంగల్ నగరంలో కన్నీటి వీడ్కోలు పలికారు. శుక్రవారం మేకల రవి అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందగా శనివారం వరంగల్ లో అశృనయనాల మద్య అంత్యక్రియలు నిర్వహించారు. వరంగల్ నగరంలోని శివ నగర్ లో గల మేకల రవి స్వగృహం వద్ద ఆయన భౌతిక కాయాన్ని ఉంచగా వందలాది మంది ప్రజలు, సిపిఐ కార్యకర్తలు తరలి వచ్చి నివాళులు అర్పించారు.అంత్యక్రియల సందర్భంగా దారి పొడవునా మేకల రవి అమర్ రహే.. మేకల రవి ఆశయాలను కొనసాగిస్తాం అంటూ నినాదాలు చేశారు. పేదల సమస్యల పరిష్కారం కోసం, గుడిసె వాసులకు ఇండ్ల స్థలాల కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. సిపిఐ నాయకులు మేకల రవి అకాల మృతి ప్రజా రంగానికి పార్టీకి తీరని లోటు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మేకల రవి భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించిన అనంతరం కూనంనేని మాట్లాడుతూ మేకల రవి జీవితాంతం పేదల సంక్షేమం, కార్మికుల హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే శ్రమించారని అన్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ పోరాటాలు నడిపిన నిజాయితీ గల నాయకుడు మేకల రవి అని తెలిపారు. ​ఆయన ఆశయాలు, చూపిన బాట ఎప్పటికీ ఆదర్శనీయమైనవని, వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేస్తున్నానని, వారి కుటుంబానికి సీపీఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ర‌వి మృతికి రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి నర్సింహ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు వరంగల్ శివ నగర్ కు చేరుకుని రవి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వారిలో సిపిఐ వరంగల్,హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల కార్యదర్శులు ఎస్ కే బాష్ మియా, కర్రె బిక్షపతి, బి. విజయ సారథి, సిహెచ్ రాజారెడ్డి, కొరిమి రాజ్ కుమార్,మంద పవన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, సీనియర్ నాయకులు టి. వెంకట్రాములు, తమ్మెర విశ్వేశ్వరరావు, మోతె లింగారెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి, డిహెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, జిల్లా పార్టీ సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, పనాస ప్రసాద్, దండు లక్ష్మణ్,వివిధ జిల్లాల కార్యవర్గ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!