ePaper
Saturday, October 31, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్బాణసంచా దుకాణాలకు అనుమతుల జారీలో నిబంధనలు పాటించాలి

బాణసంచా దుకాణాలకు అనుమతుల జారీలో నిబంధనలు పాటించాలి

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ ములుగు
రహదారి ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జి ఆదేశించారు. దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాలకు అనుమతులు జారీ చేసే ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
శుక్రవారం ములుగు జిల్లా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో రహదారి భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, బాణసంచా దుకాణాల అనుమతులు, భద్రతా చర్యలపై అదనపు కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలను వివరించాలని అధికారులకు సూచించారు.మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు, యువతకు, విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. యువత వ్యసనాల బారిన పడకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. గ్రామ, మండల స్థాయిల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారులు అగ్నిమాపక శాఖతోపాటు సంబంధిత శాఖల నుంచి నిరభ్యంతర ధ్రువపత్రాలు పొంది, వాటి ఆధారంగా జిల్లా కలెక్టర్ నుంచి తాత్కాలిక లైసెన్సులు తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి, నిబంధనల మేరకు అనుమతుల జారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లైసెన్సులు పొందిన తర్వాతే అనుమతించిన ప్రదేశాల్లో దుకాణాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. దుకాణాల వద్ద అగ్నిప్రమాద నివారణ పరికరాలు, నీరు, ఇసుక అందుబాటులో ఉంచాలని తెలిపారు. వ్యాపారులు భద్రతా నిబంధనలు పాటిస్తున్నారో లేదో సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో డీఎస్పీ రవీందర్, ఆర్ అండ్ బి అధికారి శ్యామ్ సింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, రవాణా శాఖ అధికారి ఈశ్వర్ సింగ్ ఠాకూర్, డీఎఫ్‌ఓ నాగరాజు, కలెక్టరేట్ పర్యవేక్షకులు మహేష్ బాబు, మున్సిపాలిటీ కమిషనర్ సంపత్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!