ePaper
Thursday, July 9, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య శారద

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య శారద

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వరంగల్,:భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారద మంగళవారం దుగ్గొండి మండలంలోని లక్ష్మీపురం,దుగ్గొండి,గోపాలపురం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈసందర్భంగా  ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఓటరు వివరాల నమోదు, ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించి, బీఎల్‌వోలు నిర్వహిస్తున్న పనితీరుపై ఆరా తీశారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించి, ఓటరు జాబితా శుద్ధి ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ, ఇంటింటి సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలని బీఎల్‌ఓలకు సూచించారు. ఈ పరిశీలనలో నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, దుగ్గొండి తహశీల్దార్ సమ్మక్క, నర్సంపేట తహశీల్దార్ రవిచంద్ర రెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!