ePaper
Saturday, July 4, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్వ‌రంగ‌ల్ ప్రభుత్వ పాలిటెక్నిక్,స్పాట్ అడ్మిషన్ల కోసం జూలై 3 చివ‌రితేది

వ‌రంగ‌ల్ ప్రభుత్వ పాలిటెక్నిక్,స్పాట్ అడ్మిషన్ల కోసం జూలై 3 చివ‌రితేది

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్‌లో స్పాట్ అడ్మిషన్ల కోసం జూలై రెండ‌వ‌తేది నాటికి తాజా ఖాళీ సీట్ల స్థితి ప్రకారం డిప్లొమా కోర్సులలో కొన్ని సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన  అభ్యర్థులు  ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జూలై మూడ‌వ తేది నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

తాజా ఖాళీ సీట్ల వివరాలు (02-07-2026 నాటికి)

– Civil Engineering (CE) – 01 ఖాళీ సీటు
– Civil Engineering (Real Estate & Valuation) (CRV) – 21 ఖాళీ సీట్లు
– Electronics & Communication Engineering (ECE) – 02 ఖాళీ సీట్లు
– Mechanical Engineering (ME) – 35 ఖాళీ సీట్లు

– దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ: 03-07-2026
– స్పాట్ అడ్మిషన్లు: 04-07-2026

చెల్లించవలసిన ఫీజులు

1. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ప్రవేశ సమయంలో చెల్లించవలసిన సంస్థ ఫీజు:
₹5,080/-

2. స్పాట్ అడ్మిషన్ ప్రాసెసింగ్ ఫీజు: TG POLYCET అర్హత పొందిన అభ్యర్థులు – SC/ST – ₹300/- – ఇతరులు (OC/BC/EWS) – ₹600/-

TG POLYCET అర్హత పొందని అభ్యర్థులు – SC/ST – ₹550/– ఇతరులు (OC/BC/EWS) – ₹1100/-

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ప్రవేశం పొందే అభ్యర్థులు సంస్థ ఫీజు 5,080 రూపాయాల‌తో పాటు,స్పాట్ అడ్మిషన్ ప్రాసెసింగ్ ఫీజును కూడా నిబంధనల ప్రకారం చెల్లించవలసి ఉంటుందని వివ‌రించారు.

– TG POLYCET ర్యాంక్ కార్డు (అర్హత పొందిన అభ్యర్థులకు)
– SSC లేదా తత్సమాన పరీక్ష మార్కుల మెమో
– IV నుండి X తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
– ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)
– కుల ధ్రువీకరణ పత్రం (వర్తించినట్లయితే)
– నివాస ధ్రువీకరణ పత్రం (అవసరమైతే)
– ఒక సెట్ జిరాక్స్ ప్రతులు స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా వ్యక్తిగతంగా ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్‌కు హాజరై, పై పేర్కొన్న ఒరిజినల్ ధ్రువపత్రాలు అవసరమైన ఫీజులతో రావలసిందిగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కొరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!