ePaper
Sunday, August 30, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్శివనగర్ ప్రాంతాన్ని ముంపు నుంచి కాపాడుతాం.

శివనగర్ ప్రాంతాన్ని ముంపు నుంచి కాపాడుతాం.

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ మహనగరంలోని శివనగర్ ప్రాంతాన్ని ముంపు నుంచి కాపాడేందుకు మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడతామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు తెలిపారు. మంగళవారం నాడు ముంపుకు గురయ్యే ప్రాంతంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పర్యటించారు. ముఖ్యంగా 35వ డివిజన్ మైసయ్య నగర్, ఏసీ రెడ్డినగర్ ప్రాంతాల్లో పర్యటించి స్లమ్ వాటర్ డ్రైనేజ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ స్థానికంగా అండర్ డ్రైనేజీ నిర్మాణంతో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి త్వరలోనే రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. ఖిలా వరంగల్ అగర్తల చెరువు నుంచి వచ్చే వర్షపు నీరు మరియు చింతల్ నుంచి వచ్చే వర్షపు నీరు శివనగర్ స్మశాన వాటిక దగ్గర ఉన్న జంక్షన్ లో కలిసేలా స్లమ్ వాటర్ డ్రైనేజ్ పని పూర్తి చేయాలని కాంట్రాక్టర్ లకు సూచించారు. ముంపు ప్రాంతాలపై మంత్రి కొండా సురేఖ ప్రత్యేక కార్యాచరణను అమలు చేసేందుకు అధికారులను సమాయాత్తం చేస్తున్నారని కొండా మురళి తెలిపారు.శివనగర్ వాటర్ ట్యాంకు నుంచి అంబేద్కర్ భవన్ వరకు సిసి రోడ్డు నిర్మించాలని అధికారులకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!