ePaper
Thursday, September 10, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం..

ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం..

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హైదార‌బాద్
హైదరాబాద్‌లోని బల్కంపేట శ్రీ ఎల్లమ్మ తల్లి దివ్య కల్యాణ మహోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి గీతారెడ్డి తో కలిసి మంత్రి కొండా సురేఖ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాము.రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి, అనంతరం వైభవంగా జరిగిన దివ్య కల్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.అమ్మవారి కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మంత్రి ప్రార్థించారు. బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో పాల్గొని, అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి కొండా సురేఖ అన్నారు.బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునేలా సమగ్ర ఏర్పాట్లు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.అమ్మవారి దివ్య ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం మరింత సుభిక్షంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా విజయవంతంగా కొనసాగాలని ప్రార్థించాను. అలాగే ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు,వెల్లివిరియాలని అమ్మవారిని మంత్రి వేడుకున్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!