ePaper
Friday, July 31, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్భద్రకాళి బండ్ పై పెండింగ్ పనులను పూర్తి చేయాలి:

భద్రకాళి బండ్ పై పెండింగ్ పనులను పూర్తి చేయాలి:

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ వరంగల్ వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ పై పెండింగ్ పనులను పూర్తి చేసేలా చూడాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్  టి.వెంకన్న అధికారులను ఆదేశించారు.గురువారం నగర పరిధి లోని భద్రకాళి, వడ్డేపల్లి బండ్ లను క్షేత్ర స్థాయిలో సందర్శించి పూర్తి చేసిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొని వేగవంతం గా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భం గా భద్రకాళి బండ్ పై పూర్తి చేసిన పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీ వారు పక్షం రోజులో బండ్ పై మిగిలిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని అన్నారు. వడ్డేపల్లి బండ్ ను సందర్శించిన కమిషనర్ బండ్ పై కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని ఆగస్టు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రకాళి బండ్ పై హార్టికల్చర్ కు సంబంధించి గ్రీనరీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని
అందుకోసం అంచనాలు తయారు చేయాలని అన్నారు. వడ్డేపల్లి బండ్ పైన గ్రీనరీ ఏర్పాటు కు టెండర్ ప్రక్రియ పూర్తి అయినందున వెంటనే పనులను ప్రారంభించాలనిహార్టికల్చర్ అధికారిని ఆదేశించారు.ఈ పర్యటన లో కమిషనర్ వెంట పర్యవేక్షక ఇంజనీర్ రాజ్ కుమార్, హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, డి ఈ రాజ్ కుమార్, ఏ ఈ హరికుమార్ పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!